పెండింగ్ బిల్లులు ఎప్పడు చెల్లిస్తరు?
రాష్ట్రంలో ఆర్థికశాఖ వద్ద పేరుకుపోయిన బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మెడికల్ బిల్లులు, సాలరీ ఏరియర్స్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ వంటి అ నేక రూపాల్లో ఉన్న బిల్లులు సకాలంలో చెల్లించకుండా ఆర్థిక శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు.
- ఆర్థికశాఖ చుట్టూ ప్రదక్షిణలు
- అధికారులు స్పందించడం లేదని బాధితుల ఆవేదన
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థికశాఖ వద్ద పేరుకుపోయిన బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మెడికల్ బిల్లులు, సాలరీ ఏరియర్స్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ వంటి అ నేక రూపాల్లో ఉన్న బిల్లులు సకాలంలో చెల్లించకుండా ఆర్థిక శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. సచివాలయంలో అర్జీలు ఇస్తున్నప్పటికీ పట్టించుకునే వారు ఎవరూ లేరని, కనీసం సరైన సమాధానం చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేకుండా పోతున్నారని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
మూడు నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పేరుతో బిల్లులు చెల్లించకుండా సర్కారు కాలయాపన చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో బిల్లుల కోసం బాధితులు మళ్లీ రాష్ట్ర సచివాలయంలోని ఆర్థికశాఖ అధికారుల చుట్టు తిరుగుతున్నారు. టోకెన్ నంబర్లతో ఆయా కార్యాలయాల్లో ఆర్జీలతోపాటు టోకెన్ నంబర్లను ఇస్తున్నారు. రాష్ట్ర సచివాలయం సిబ్బందికి కూడా సకాలంలో బిల్లులు చెల్లించడం లేదంటూ సచివాలయం ఉద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

