హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు తొలి వేతనం కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. సివిల్, ఏఆర్, ఐటీఅండ్సీ, పీటీవో, బెటాలియన్ కలిపి 12 వేల మంది విధుల్లోకి చేరారు. గత నవంబర్లో శిక్షణ తర్వాత డ్యూటీ అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్నవారికి కూడా వేతనం రాలేదు. కామారెడ్డి, సంగారెడ్డితో పాటు కొన్ని జిల్లాల్లో పోస్టింగ్ తీసుకున్న వాళ్లలో కొందరికి మాత్రమే వేతనాలు అందినట్టు సమాచారం. మిగతా జిల్లాల్లోని 10వేల మంది కానిస్టేబుళ్లు వేతనం కోసం నిరీక్షిస్తున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.