Municipal Elections | హైదరాబాద్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): వచ్చే జనవరిలో పాలకవర్గాల గడువు ముగియనున్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీల పాకవర్గాల గడువు జనవరి 26తో ముగియనున్నది. మరో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది.
మొత్తం గా 135 మున్సిపాలిటీలకు ఎన్నికలు అనివార్యం అవుతుంది. ఈ దశలో వచ్చే జనవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం నుంచి హింట్ వచ్చింది. మరోపక్క బీసీ కులగణన ప్రక్రియ కొనసాగుతుండగా, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావా ల్సి ఉన్నది.