హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సుదీర్ఘ మంతనాలు సాగించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో ఈ నివేదికపై ఏం చేయాలి?
ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగే సందర్భంలో ప్రత్యేకంగా బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు ఏయే అంశాలను ప్ర ముఖంగా ప్రస్తావించాలి? అనే అంశంపై చర్చించారని సమాచా రం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై అధ్యయనం చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ గత నెల 31న 655 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే.