హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : విద్యాహక్కు చట్టంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై కౌంటర్ ఎందుకు వేయలేదని తెలంగాణ, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పిల్‌పై మంగళవారం విచారణ చేపట్టిన విక్రమ్‌నాథ్, సంజయ్ కరోల్, సందీప్మోహతాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.