జనగామ రూరల్, ఫిబ్రవరి 6 : జనగామ జిల్లా జనగామ మండలంలో గోదావరి కాల్వలు ఉన్నా నీళ్లు అడుగంటాయి. చుక్కనీరు రాకపోవడంతో చెరువులు ఎండిపోయి, బోరుబావుల్లోనూ నీరులేక పంటపొలాలు ఎండిపోతున్నాయి. కొద్దిగా పెట్టిన వరికి కూడా సరిపడా నీరులేక పొలాలు బీటలువారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా కాల్వల ద్వారా సాగునీటిని అందించాలనే ధ్యాస లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి ఫీట్లు వేసినా బోర్లలో చుక్క నీరు వస్తలేదని రైతులు వాపోతున్నారు.
కొందరు రైతులు విడుతల వారీగా పంటలకు నీరు అందిస్తున్నారు. మండలంలోని పెద్దరాంచర్ల, సిద్దెంకి, పెద్దపహాడ్, ఎర్రకుంట తండా, ఎల్లంల, పెంబర్తి ఓబుల్‌కేశ్వాపూర్, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో నీళ్లు అడుగంటాయి. పెద్దరాంచర్లకు చెందిన పొన్నాల ప్రభాకర్‌రెడ్డి, సిద్దెంకి గ్రామానికి చెందిన ముస్త్యాల వెంకటయ్య, బిట్ల రవీందర్‌రెడ్డి తదితర రైతుల పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతుండటంతో రైతులు వాటిని జీవాలకు వదిలేస్తున్నారు.
నాకు 4.20 ఎకరాలు భూమి ఉన్నది. అందులో ఎకరం పడావుగా ఉంది. 3.20 ఎకరాలు వరినాటు వేసిన. అందులో 20 గుం టలు పారుతుంది. మిగిలిన 3 ఎకరాలు ఎండిపోయింది. పక్కనే గోదావరి కాలువ నీరు రావడంతో గతంలో పొలం మొత్తం నాటు వేసిన. రెండు బోర్లలో ఒకటి ఎండిపోయింది.