హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిఆన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Welfare schemes) పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది. అర్హుల లిస్టులో మా పేర్లు ఏందుకు రాలేదని అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన నాలుగు పథకాల పంపిణీ గందగోళం, ప్రజల అడ్డగింతల(Protests) మధ్య కొసాగింది. కరీంనగర్ జిల్లాలోని గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అధికారులను అడ్డుకున్నారు. జమ్మికుంట మండలం గండ్రపల్లిలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లాతొర్రూరు మండలంలోని ఖానాపురం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాల పంపిణీ కార్యక్రమంలో లిస్టులో మా పేర్లు ఏందుకు రాలేదు అని అధికారులను నిలదీశారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం సాంగ్వి గ్రామంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్ కాపీల అందజేత కార్యక్రమం రసాభాసగా మారింది. సాంగివి గ్రామానికి అనుబంధంగా ఉన్న మల్లాపూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని తాము ఏం పాపం చేశామని అధికారులను నిలదీశారు. తమకు కూడా ఇదే రోజు సంక్షేమ పథకాలను అందజేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవంటూ మహిళలు, గ్రామస్తులు అధికారులను నిలదీశారు. కాగా, పోలీసుల బందోబస్తు నడుమ ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లాలో..
సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవంటూ అధికారులు నిలదీసిన మహిళలు, గ్రామస్తులు pic.twitter.com/nkV4CNxZ8M
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025