హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ కృషి, సీఎం కేసీఆర్ చొరవతో బృహత్తర అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బుద్ధవనం ప్రాజెక్టు చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మం చాల లింగస్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్, మల్లేపల్ల్లి లక్ష్మయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డాక్టర్ మంచాల లింగస్వామి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేదర్ కేవలం దళితులకు మాత్ర మే నాయకుడు కాదని, సకలజనుల హితం కోరిన దార్శనికుడు అని పేర్కొన్నారు.
ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ ఏర్పాటైందని, ఇందుకు కృతజ్ఞతగా 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సమాజమంతా రుణపడి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆలోచన, దృఢ సంకల్పంతో ఆయన మార్గదర్శత్వంలో అంబేదర్ విగ్రహం ఏర్పాటుకు మొకవోని దీక్ష, అలుపెరగకుండా పనిచేసి దిగ్విజయంగా పూర్తి చేసిన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరివి వినయ్ కుమార్, అంసా రాష్ట్ర నాయకులు దుగ్గి సురేశ్, మంచాల శంకర్, రాహుల్ మద్నూరి, నామ సైదులు, గోలి ప్రవీణ్, మాల యువసేన నాయకులు దుబ్బాక నవీన్, చేతన్, ఆదర్శ్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.

Koppula