హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంసెట్ కౌన్సెలింగ్ తరహాలో ఉద్యోగుల బదిలీలు చేపట్టడం, ఒకే తరహా పోస్టు ల్లో మళ్లీ పనిచేసేందుకు అవకాశం లేకుండా వెబ్ అప్లికేషన్ను రూపొందించడం చాలా మందికి మింగుడు పడటం లేదు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో ఒకే చోట 2 ఏండ్లు పైబడి పనిచేసిన వారికే బదిలీ ఆప్షన్స్ ఇచ్చారు. డిస్కంలోని మొత్తం ఉద్యోగుల్లో 50% మందినే బదిలీ చేయాలని నిర్ణయించి, అందులో దా దాపు 850 ఉద్యోగులకు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యుత్తు శాఖలో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 7 వరకు గడువు ఇచ్చా రు. ప్రస్తుతం డీఈ (డివిజినల్ ఇంజినీర్), ఏడీఈ, ఏఈ నుంచి కింది స్థాయి ఉద్యోగులు బదిలీల ప్రక్రియలో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం బదిలీల కోసం జరుగుతున్న వెబ్ కౌన్సెలింగ్లో చర్చంతా ఫోకల్ పోస్టుల చుట్టూనే నడుస్తున్నది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నతాధికారులైనా, తర్వాతి స్థాయి ఉద్యోగులైనా ఫోకల్ పోస్టుల్లో పనిచేసి ఉంటే.. వారికి బదిలీల సమయంతో వేరే నాన్-ఫోకల్ పోస్టులకు సంబంధించిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. దీంతో ఎంతో కీలకమైన ఫోకల్ పోస్టును తాజా బదిలీల్లో మళ్లీ సాధించే అవకాశం లేకుండా పోతున్నదని కొందరు మదనపడుతుండగా.. మరికొందరు మాత్రం ఇది మంచి విధానమని అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ పరిధిలోని 10 సర్కిళ్లలో పోస్టింగ్ కోసం చూసున్నవారికి ఈ విధానం అవకాశం ఇవ్వడం లేదని, గ్రామీణ ప్రాంతాలు, ప్రాధాన్యత లేని పోస్టుల్లో పనిచేసినవారికి ఇది మంచి అవకాశమని పే ర్కొంటున్నారు. విద్యుత్తు శాఖలో బదిలీ ప్ర క్రియ 7 తర్వాత ముగుస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.