హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఉపశమనం కలిగించే ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈనెల రెండో వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో 11 లేదా 12న అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొన్నది. దీంతో విస్తారంగా వర్షాలు కురు స్తాయని వెల్లడించింది.
అకాల వర్షాల వల్ల నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మినహా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో అత్యధికంగా 45.4, జగిత్యాల జిల్లాలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.