Konda Surekha | రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పని చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో నాలుగో అంతస్తులోని కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ సందర్భంగా పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపునుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అధికారులు పండితులు మంత్రి దంపతులను కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.