హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా జీవో-46 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరు తూ జీవో-46 అభ్యర్థులు శుక్రవారం కేటీఆర్‌ను నందినగర్‌లోని నివాసంలో కలిశారు. ఎన్నికలకు ముందు జీవో-46ను రద్దు చేస్తామని నమ్మబలికితే కాంగ్రెస్ పార్టీ గెలిచేందు కు సహకరించామని, అయితే ఆ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత తమను పట్టించుకోవ డం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యాత్మకంగా మారిన జీవో-46 అంశంపై తాను గతంలో సీఎస్‌తో మాట్లాడిన విషయా న్ని కేటీఆర్ వారికి గుర్తుచేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ నుంచి కావాల్సిన సహకారాన్ని అందిస్తామని అభయమిచ్చారు. ఈ విషయంలో తమ పార్టీ నాయకులు గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
అభ్యర్థుల కు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామ ని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిషరించాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసుల పేరు చెప్పి తప్పించుకుంటూ అభ్యర్థులకు అన్యాయం చేసే ప్రయత్నం మంచిదికాదని హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ధైర్యమిచ్చిన కేటీఆర్‌కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పార్టీ నాయకులు రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవో-46 వల్ల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చేపట్టే ఉద్యోగ నియామకాలతోపాటు తొమ్మిది శాఖల ఉద్యోగాల భర్తీలో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.