ఆదివారం 07 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 15:59:14

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జగదీశ్‌రెడ్డి

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ  :  అంగడిపేట స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి జగదీశ్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. మూడు లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం దేవరకొండ చేరుకున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి.. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌తో కలిసి స్థానిక ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు.

మృతుల కుటుంబాలకు డబుల్‌ బెడ్రూంలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మృతుల పిల్లలను  గురుకుల పాఠశాలల్లో చేర్పించి ఉచిత విద్య అందిస్తామన్నారు. గాయపడిన వారికి  ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన చికిత్స అందేలా చూస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చి వారిలో మనోధైర్యం నింపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo