నార్నూర్, ఫిబ్రవరి 27 : తాగు నీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేశ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ పంచాయతీ పరిధిలోని బోజ్జు కొలాంగూడ నెలకొన్న నీటి సమస్యపై ‘గిరిజనుల తాగునీటి తంటాలు’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆదేశాలతో అధికారులు బోజ్జు కొలాంగూడ గ్రామానికి వెళ్లారు. కొలాం గిరిజనులు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య పరిష్కారానికి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని, త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈయన వెంట ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఏఈ సుభానీ, నాయకులు దిలీప్ ఉన్నారు.