Harish Rao | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తం..మాజీ మంత్రి హరీశ్‌రావు
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో తిరిగి ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు.
- బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అమలు
- ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రియల్ వ్యాపారం
- ఫార్మాసిటీకే కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి
- రూల్స్ అతిక్రమిస్తే భూములు వెనకి ఇవ్వాల్సిందే : హరీశ్
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో తిరిగి ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా సిటీకే అనుమతులు ఇచ్చింది అని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం.. ‘ప్రాజెక్టులో 75 శాతం ఫార్మాసిటీ ఉండి, దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలైన ఎడ్యుకేషన్, హౌసింగ్ వంటివి మిగతా 25 శాతంలో రావాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పూర్తిగా తారుమారు చేస్తున్నది. 75 శాతం రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసి, కేవలం 25 శాతమే ఫార్మా రంగానికి పరిమితం చేయాలని చూస్తున్నది. ఇది చట్ట ప్రకారం ఎంతమాత్రం చెల్లదు. ప్రాజెక్టులో ఇలాంటి డీవియేషన్లు (నిబంధనల ఉల్లంఘనలు) ఉంటే, సేకరించిన రైతుల భూములను తిరిగి వారికే ఇచ్చేయాలని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెప్తున్నది. ఇది నా మాట కాదు. చట్టం చెప్తున్న సత్యం’ అని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్‌లో గురువారం ఎన్నారైల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా.. తాము ఫార్మా సిటీని కొనసాగిస్తున్నామని రేవంత్ ప్రభుత్వమే స్వయంగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని తెలిపారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఫార్మాసిటీ పక్కకు
ఫార్మాసిటీ పూర్తయితే బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందనే కుళ్లు రాజకీయ ఉద్దేశంతోనే రేవంత్ సరార్ దీన్ని పకనబెట్టిందని హరీశ్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ ములు పంచిపెట్టి వెనుకదారిలో పెద్ద లబ్ధి పొందాలనే సెచ్ వేశారు’ అని ఆరోపించారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

