Medigadda Barrage | మేడిగడ్డ బరాజ్‌పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నెల రోజుల్లో నివేదిక అందజేస్తుందని, దాని ఆధారంగా బరాజ్‌కు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన సచివాయంలో మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడారు. ఎల్ అండ్ టీ సంస్థ మేడిగడ్డ కట్టిందనే రికార్డుల్లో ఉన్నదని, వేరే సబ్ కాంట్రాక్టర్ల పేర్లు లేవని అన్నారు. అందుకే ఎల్ అండ్ టీ సంస్థకు రూ.400 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉంచామని తెలిపారు. తాను శనివారం ఢిల్లీ వెళ్తున్నానని, మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానని చెప్పారు.
మేడిగడ్డపై తాము సమాచారంగానీ, పత్రాలుగానీ ఇవ్వలేదని జలశక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పడం అవాస్తవమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ అందిందని, చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.