హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న ప్రైవేటు క్లినిక్లపై దాడులు చేసేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎంసీ) సిద్ధమైంది. బుధవారం హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్తో టీజీఎంసీ ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 ప్రైవేటు క్లినిక్లపై దాడులు చేసినట్టు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇష్టారీతిన మందులను రాస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 550మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశామన్నారు.