నాగర్ కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి( Palamuru Ranga Reddy ) ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy ) హెచ్చరించారు. ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేసేందుకు పూనుకుంటే పార్టీలకతీతంగా ఉద్యమిస్తానని, అందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటున్నదని, అలాంటి ప్రయత్నాలు మానుకోకుంటే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డిని ( CM Revanth Reddy) , ప్రభుత్వాన్ని హెచ్చరించారు.