హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: డెస్జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్‌పాస్‌లు సహా అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ తెలిపారు. డెస్ జర్నలిస్టులను, ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడ టం లేదని చె ప్పారు. ఆదివా రం బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో టీ యూడబ్ల్యూజే ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ, ముఖ్యనేతలతో కలిసి విరాహత్ మాట్లాడారు. డెస్‌లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జర్నలిజం లో విలువలను పెంచేలా ప్రభుత్వం 252 జీవో తీసుకొచ్చిందని అన్నారు. డెస్ జర్నలిస్టులకు అన్యా యం జరుగుతున్నదంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారని, 13వేల అక్రెడిటేషన్ కార్డులు తగ్గుతున్నట్టు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.