రామగిరి, నవంబర్ 27: సర్వే చేయవద్దని, ఇండస్ట్రియల్ కారిడార్‌కు తమ భూ ములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పా రు. గ్రామానికి సర్వే కోసం వస్తున్న తహసీల్దార్, సిబ్బందిని గ్రామశివారులోనే అడ్డగించి వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ పరిధి మేడిపల్లి శివారు లో అధికారులు భూములు సేకరించేందు కు సిద్ధమయ్యారు. మొత్తం 178.22 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి అవసరమని నిర్ణయించి, సర్వే నంబర్ల వారీగా తీసుకుంటున్నట్టు రత్నాపూర్ జీపీ ఆఫీస్ బోర్డులో అంటించారు. విషయం తెలియడంతో ఇక్కడి రైతులు ఆగ్రహించారు. బుధవారం అధికారులు వస్తున్నారని తెలిసి మేడిపల్లి శివారులో బైఠాయించారు. రామగిరి తహసీల్దార్ రామచందర్ రావు తన సిబ్బందితో కలిసి సర్వే చేసేందుకు రాగా అడ్డుకున్నా రు. ఎందుకు సర్వే చేస్తున్నారు? ఎవరిని అడిగి సర్వే చేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణకు ‘ఫెంగల్’ ముప్పు
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో తుఫానుగా ఏర్పడబోతున్నదని హె చ్చరించారు. ఈ తుఫానుకు ‘ఫెంగల్’గా నామకరణం చేశారు. మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారి తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చునని తెలిపారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నాలుగైదు రోజులపాటు విపరీతమైన చలిగాలులు వీచనున్నాయని తెలిపారు.
ఆదిలాబాద్‌లో అత్యల్పం..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణం గా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాం తాల్లోని ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు చేరుకున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో రికా ర్డు స్థాయిలో అత్యల్పంగా 7.9 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.