కవాడిగూడ, మార్చి 2: 30 రోజులు పని కల్పించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పీస్ రేట్ మీటర్ రీడింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వారు సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనం కల్పించాలని, ఎస్పీడీసీఎల్ తరహాలో 30 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మహాధర్నాకు హాజరై కార్మికులకు మద్దతు పలికారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం నాయకులు కొడమంచిలి బాబ్జి, వడ్ల బ్రహ్మం, చిరంజీవి, ప్రశాంత్, విజయభాస్కర్, అమృత శ్రీనివాస్ పాల్గొన్నారు.