మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సలార్తండాలో ఎన్హెచ్కు భూములివ్వమని స్థానికులు తేల్చిచెప్పారు. బుధవారం జాతీయ రహదారి (930పీ) కోసం అధికారులు పోలీసులతో వచ్చి సర్వేను ప్రారంభించగా తండావాసులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట పొలాల నుంచి జాతీయ రహదారి వేస్తే తమ బతుకులు ఆగం అవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. 100 ఇండ్లు, పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఆందోళన విరమించకపోవడంతో తండావాసులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీవీవీపీ దవాఖానల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో వేతనాలు చెల్లించాలని కోఠిలోని టీవీవీపీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీవీవీపీ దవాఖానల ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.