KTR | కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే ‘చలో మేడిగడ్డ’: కేటీఆర్
చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే చలో మేడిగడ్డకు పిలుపునిచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
హైదరాబాద్: చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే చలో మేడిగడ్డకు పిలుపునిచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే ఆ కుట్రలను ఎండగట్టడానికే… ఈ చలో మేడిగడ్డ అని చెప్పారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే ఈ యాత్ర అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు
పాతరేసేందు, పంజాబ్‌నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న హస్తం పార్టీ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకే ఈ చలో మేడిగడ్డ అన్నారు. మరమ్మత్తులు కూడా చేతకాని గుంపుమేస్త్రీని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే అని మరోసారి చాటిచెప్పేందుకే ఈ యాత్ర స్పష్టం చేశారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్ చేసిన తప్పులను కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను 60 ఏండ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను అన్నదాతలు మరువలేదని గుర్తుచేసేందుకే చలో మేడిగడ్డ అని చెప్పారు.
మళ్లీ కన్నీటి సాగుకు తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించమని, మీ దుష్ట రాజకీయాల కోసం మా తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించేది లేదన్నారు. పోటీ యాత్రలు చేయడం కాదు ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండని హితవుపలికారు. మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే.. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌కే నూకలు చెల్లడం ఖాయం, వచ్చే వరదల్లో కాంగ్రెస్ పార్టీయే కొట్టుకుపోవడం తథ్యమన్నారు.
మళ్లీ తెలంగాణను
ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు
ఎండగట్టడానికే… ఈ “చలో మేడిగడ్డ”చిన్న లోపాన్ని..
పెద్ద భూతద్దంలో చూపిస్తూ..
బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని
బట్టబయలు చేసేందుకే… ఈ “చలో మేడిగడ్డ”ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును
పరిరక్షించకుండా.. కూలిపోవాలని… pic.twitter.com/wRShQ5QVze— KTR (@KTRBRS) March 1, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Chalo Medigadda
- Congress
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

