హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దక్షిణ భాగం రోడ్డుకు ఇటీవలే అలైన్మెంట్ ఖరారు చేసినట్టు చెప్పారు. త్వరలో డీపీఆర్‌లు రూపొందిస్తామని తెలిపారు.
ఉత్తరభాగం రోడ్డును నాలుగులేన్ల నుంచి ఆరు లేన్లకు పెంచడం వల్లే ప్రాజెక్టులో జాప్యం జరుగుతున్నదని వెల్లడించారు. ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలో అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ రోడ్లకు ఆగస్టులో టెండర్లు పిలుస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను ఈ నెలలో చెల్లిస్తామని చెప్పారు. లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ సురే శ్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటీ అయ్యారు.