సిద్దిపేట, డిసెంబర్ 15 : గద్దర్ లేని ఉద్యమం లేదని, ఆయన ఆర్ధ శతాబ్దపు పోరాటయోధుడని, పాట ఉన్నంత కాలం గద్దర్ సజీవంగా ఉంటారని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పీపుల్స్ కాన్ఫరెన్స్.. ప్రజా యుద్ధనౌక గద్దరన్న’ సాహిత్య పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కవి, గాయకుడు నందిని సిధారెడ్డి, గద్దర్ కుమారుడు సూర్యతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పదవులకోసం ఆశ పడకుండా తన తం డ్రి పోరాటాన్ని, చరిత్రను రేపటి భావితరానికి అందించేందుకు సూర్యం మంచి ప్రయత్నం చేశారని అభినందించారు. ఐదు దశాబ్దాల్లో జరిగిన ప్రతి పోరాటంలో గద్దర్ ఉన్నాడని, విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమం ఇలా ప్రతి దాంట్లో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించాడని, మలిదశ ఉద్యమంలో గద్దర్ అన్నను కలిసే అదృష్టం కలిగిందని తెలిపారు. గద్దర్ ఒక్క పాట 100 ఉపన్యాసాల సారాంశమని, చాలా సామాన్య పదాలతో ప్రజల హృదయాల్లోకి చేరేలా ఆయన పాటలు పాడేవారని గుర్తుచేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమాన్ని, సమాజాన్ని ఉర్రూతలూగించి ప్రజల్లో చైతన్యం తెచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌కు గద్దర్ అండగా నిలిచారని గుర్తుచేశారు.
తూఫ్రాన్ మాటిక చెరువులో నీళ్లులేవని, హల్దీ వాగులోంచి మాటిక చెరువులోని నీటిని లిఫ్ట్ చే యాలని గద్దర్ కోరితే 8 నెలల్లో పూర్తి చేసి ఆయనతోనే ప్రారంభింపజేశామని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ వచ్చాక జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని గద్దర్ లెటర్ రాస్తే వెంటనే ఒక సంతకంతో కేసీఆర్ జీతాలు పెంచారని, అది గద్దర్‌కు కేసీఆర్ ఇచ్చి న గౌరవమని తెలిపారు. ‘సిద్దిపేటలో గద్దర్ విగ్ర హం పెట్టడం మాకు చాలా గౌరవం.. దాన్ని ఏర్పా టు చేయించే బాధ్యత నాది’ అని చెప్పారు. గద్దర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ చేయాలని అందు కు తాను సహకరిస్తానన్నారు. సమాజంలో అసమానతలు చెరిగిపోవాలంటే గద్దర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని, ఎప్పటి వరకు ప్రభుత్వం ప్రజల ఆలోచలను తీసుకెళ్లదో.. అణచివేస్తూ ఉంటదో అకడ ప్రభుత్వ అవార్డులకు అర్థం లేదు అనే మాట గద్దర్ చెప్పారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ను మాయం చేసిన రేవంత్‌రెడ్డి అవార్డు ఇస్తే తృణప్రాయంగా తిరసరించిన నందిని సిధారెడ్డి సిద్దిపేట బిడ్డ కావడం నిజంగా గర్వకారణమని కొనియాడారు. త్వరలోనే గద్దర్ విగ్రహాన్ని ఏర్పా టు చేసుకొని భారీ బహిరంగ సభను సిద్దిపేటలో నిర్వహించుకుందామని చెప్పారు. కార్యక్రమంలో పోచబోయిన శ్రీహరి యాదవ్, శంకర్, ఆస శ్రీరాములు,సత్తయ్య, సిద్దెంకి యాదగిరి, ఆస లక్ష్మణ్, భీమసేన తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభిప్రాయపడ్డారు. గద్దర్ తరగని గని అని, ఆయన ఆశయాలు అనంతమని చెప్పారు. 2006లో మొదటిసారి తెలంగాణ కోసం జరిగిన ధూంధాంలో గద్దర్‌ను కలిశానని, మలి విడత సాంసృతిక ఉద్యమానికి గద్దర్‌ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. కూటికి లేని తల్లిని గురించి ఆలోచించిన వ్యక్తి గద్దర్ అని, ప్రజల కోసం పాటలు రాసి ప్రజల కోసమే పాట పాడిన కవి గద్దర్ అని కొనియాడారు.
గద్దరు పాట రాని తెలంగాణ వ్యక్తి లేడని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. ప్రజలను తన పాటలతో సాయుధులను చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ప్రజాగర్జనకు.. ప్రజాపాటకు రా గం తాళం సమకూర్చితే అది గద్దర్ అని, రైతుకూలీల గుండెల్లో, కార్మికుల్లో కొండంత విశ్వాసాన్ని కల్పించిన వ్యక్తి గద్దర్ అని, తెలంగాణలో భూమికోసం భూకంపం సృష్టించిన వ్యక్తి, ప్రజా సమూహాన్ని కదిలించిన కవి గద్దర్ అని కొనియాడారు.
పాటల ప్రపంచం గద్దర్ అని, ఆయన పుస్తకాన్ని సిద్దిపేటలో ఆవిషరించుకోవడం తనకు జీవితాం తం గుర్తుండిపోతుందని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి చెప్పారు. గద్దర్‌తో తనకు 50 ఏండ్ల అనుబంధం ఉన్నదని, ప్రజల పాటలకు సంప్రదాయా న్ని ఇచ్చిన కవి గద్దర్ అని గుర్తుచేశారు. వరంగల్‌లో 10 లక్షల మందితో నిర్వహించిన రైతు కూలీ సభ ను తన పాటలతో అలరించిన గొప్పకవి, గాయకు డు గద్దర్ అని, ఆయనతో పోల్చగలిగిన కవి, రచయిత లేడని తెలిపారు. అంబేదర్ తర్వాత దళితుల్లో అంతటి మేధావి గద్దర్ మాత్రమేనని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య కొనియాడారు. సిద్దిపేటలో గద్దర్ విగ్రహ ఏర్పాటు కు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హల్దీ వాగుపై లిఫ్ట్ ప్రాజెక్టు మంజూరు చేయించి గద్దర్‌తోనే శంకుస్థాపన చేయించారని గుర్తుచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఫుడ్ పాయిజన్‌తో దవాఖానల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల కథనాలను జతచేసి ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పెద్దల మీదున్న ధ్యాస గురుకులాల్లో అవస్థలు పడుతున్న విద్యార్థులపై లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేదని, పిల్లల ప్రాణాలు పోతున్నా సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.