హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యాన పంటల రోడ్ మ్యాప్ రూపొందించి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తామని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు. వర్సిటీలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన విద్యార్థులు స్టార్టప్‌లను ప్రారంభించేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ చీనా, డీన్ ఆఫ్ పీజీ స్టూడెంట్స్ డాక్టర్ సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.