e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News సిద్దిపేటలా తీర్చిదిద్దుతాం

సిద్దిపేటలా తీర్చిదిద్దుతాం

  • హుజూరాబాద్‌, జమ్మికుంట అభివృద్ధికి ప్రణాళిక
  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌

హుజూరాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 25: కరీంనగర్‌, సిద్దిపేట తరహాలో హుజూరాబాద్‌, జమ్మికుంటను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారు. సోమవారం హుజూరాబాద్‌లోని 7,11వ వార్డులు, జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, బిజిగిరిషరీఫ్‌ గ్రామాల్లో ఆయన గెల్లు తరఫున ప్రచారం చేశారు. అనంతరం హుజూరాబాద్‌లో టీఎన్జీవో విశ్రాంత ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఆయాచోట్ల వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో హుజూరాబాద్‌-జమ్మికుంట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుచేసి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. హుజూరాబాద్‌కు మెడకిల్‌ కాలేజీ, ఫ్లడ్‌లైట్ల స్టేడియం, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌-నాన్‌ వెజ్‌ మారెట్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. మనకు అన్నం పెట్టే చేయి ఏదో, దాచుకున్నది దోచుకుంటున్నది ఎవరో గుర్తించాలని ప్రజలకు సూచించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు హుజూరాబాద్‌కు ఏమైనా చేశారా?.. బీజేపీ మంత్రులు వట్టి మాటలు మాట్లాడుతున్నరని మండిపడ్డారు. బీజేపీ నేతల మాయ మాటలు నమ్మవద్దని కోరారు. చెప్పింది చేసేది కేసీఆరేనని స్పష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement