హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆలోచనలను ఆశయాలుగా మార్చి వాటి సాధనకు కృషిచేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చెప్పారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఆయన మొకలు నాటారు. వందల మంది విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను మొకలునాటి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొకలు నాటడం గొప్ప విషయని చెప్పారు. వేడుక ఏదైనా మొక నాటాలనే ఆలోచన ఇప్పుడు ప్రతి ఒకరిలో తీసుకురావడంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయం సాధించిందని తెలిపారు.
తెలంగాణలో హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతం చేసుకొని అదే మాదిరిగా.. దేశవ్యాప్తంగా ఆకుపచ్చని ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఇప్పటి దాకా స్వచ్ఛందంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామ్యులైన ప్రతిఒకరికి సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్స్ కరుణాకర్‌రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ సంతోష్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ మొకలు నాటారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని నివాసంలో మొకలు నాటి సంతోష్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా చకటి పేరు సంపాదించిందని పేర్కొన్నారు.