‘ఐఎంజీ భారత్’ తీర్పును స్వాగతిస్తున్నాం
ఐఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్ర భుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీ ర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
- బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో: ఐఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్ర భుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీ ర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఐఎంజీ భారత్ సంస్థ వేసిన పిటిషన్‌ను రద్దు చేసి 850 ఎకరాల భూమిని తిరిగి ప్ర భుత్వానికి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గచ్చిబౌలిలోని సదరు ప్ర భుత్వ భూమిని చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పగించిన వ్య వహారంపై సీబీఐ వంటి ప్రముఖ సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధ్యులెవరూ తప్పించుకోకుం డా చర్యలు తీసుకోవాలని కోరారు. హైకోర్టు తీర్పుతో హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, మిగ తా ప్రభుత్వ ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి రావడం హర్షణీయమని పేర్కొన్నా రు. ఐఎంజీ భారత్ సంస్థ అధినేత బిల్లీరావుకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేదని, ఆసంస్థకు ఫ్లోరిడాలో ఎలాంటి లింకు లు లేవని పేర్కొన్నారు. ఆనాడు ఎకరం ధర రూ.13 లక్షలు ఉంటే రూ.25 వేల నుంచి రూ.50 వేలకే 400 ఎకరాలు కంపెనీకి కేటాయించి రిజిస్ట్రేషన్ కూడా చేశారని వివరించారు. అనంతరం వైఎస్సార్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయగా ఐఎంజీ భారత్ కంపెనీ కోర్టు ను ఆశ్రయించిందని తెలిపారు. 21 ఏం డ్ల తర్వాత ఈ తీర్పు ఇవ్వడం ముదావహమని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

