హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని అర్జునపట్ల, కమలాయిపల్లి గ్రామాలను మద్దూర్ మండలం నుంచి చేర్యాల మండలానికి మారుస్తున్న ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు-2025పై జరిగిన చర్చలో పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
ఈ రెండు గ్రామాలు రెవెన్యూ పరంగా చేర్యాల మండలంలో, పంచాయతీరాజ్ పరంగా మద్దూర్ మండలంలో మిగిలినట్టు తెలిపారు. వీటికి ఎంపీటీసీలు మద్దూరు మండలం నుంచి ఈ బిల్లు ద్వారా చేర్యాల మండలంలోకి రావాలని ప్రస్తావించారు.