KGBV | వెల్గటూర్/చేర్యాల, డిసెంబర్ 27 : ‘మా టీచర్లు మాకే కావాలి’ అంటూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి, సిద్దిపేట జిల్లా చేర్యాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల గేటు ఎదు ట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమగ్ర శిక్ష ద్వారా పని చేస్తున్న కేజీబీవీ సిబ్బంది తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చే యాలని కోరుతూ 18 రోజులుగా సమ్మె నిర్వహిస్తుండడంతో విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ టీచర్లకు కేజీబీవీలో విధులు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేశారు.
కుమ్మరిపల్లి కేజీబీ వీకి ఇన్చార్జి ప్రత్యేకాధికారిగా గొడిసెలపేట బీసీకాలనీలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సుశీలను నియమించారు. ఆమె శుక్రవారం పాఠశాలకు వెళ్లగా విద్యా ర్థినులు బైఠాయించి తమ టీచర్లు తమకే కావాలంటూ నినదించారు. పాఠశాల లోపలికి రాకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో సుశీల వెనుతిరిగి వెళ్లారు. ఈ విషయాన్ని ప్రత్యేకాధికారి దీప, మండల విద్యాధికారి ప్రభాకర్‌కు సమాచారం ఇవ్వగా, వారు డీఈవో దృష్టికి తీ సుకువెళ్లారు. డీఈవో రాము పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితిని సమీక్షించి వెళ్లారు. చేర్యాలలో ఎంఈవో రచ్చ కిష్టయ్య కేజీబీవీకి వచ్చి విద్యార్థినులను సముదాయించే ప్రయ త్నం చేశారు. సర్కారు స్పందించక పోతే తాము సైతం ఆందోళన చేపతామని విద్యార్థినులు హెచ్చరించారు.