సునీల్ కుటుంబాన్ని ఆదుకుంటాం

- పబ్బం గడుపుకొనేందుకే విపక్షాల డ్రామా
- మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత
- ఎమ్మెల్యే శంకర్‌నాయక్ రూ.లక్ష సాయం
గూడూరు, ఏప్రిల్ 4: ఉద్యోగం రాలేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ మాలోత్ కవిత భరోసా కల్పించారు. గత నెల 26న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా గ్రామ పరిధిలోని సోమ్లాతండాకు చెందిన బోడ సునీల్ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సతీమణి సీతామహాలక్ష్మితో కలిసి ఎంపీ కవిత తండాకు వెళ్లి సునీల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. యువత తెలంగాణ రాష్ర్టానికి వెన్నెముకలాంటి వారన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉన్నదని, ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు.
సునీల్‌కు అన్ని విధాలా చికిత్స అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, వైద్య ఖర్చులు కూడా భరించిందన్నారు. దురదృష్టవశాత్తు చనిపోవడం ఎంతో బాధించిందన్నారు. మంత్రి, ఎమ్మెల్యేతోపాటు వెళ్లి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా చూస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సునీల్ దవాఖానలో చికిత్స పొందుతున్నప్పుడు కనీసం పరామర్శించని వారు.. అతడు చనిపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తరఫున ఆయన సతీమణి సీతామహాలక్ష్మి సునీల్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం, రెండు క్వింటాళ్ల బియ్యం అందజేశారు. ఎంపీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
కాంగ్రెస్ హయాంలో సాగర్ ఎడమ కాల్వకు అన్యాయం
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
కర్ఫ్యూ, లాక్‌డౌన్‌కు అవకాశం లేదు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

