కర్ఫ్యూ, లాక్‌డౌన్‌కు అవకాశం లేదు

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 4 సూత్రాలు పాటించి వైరస్ నుంచి రక్షణ పొందాలని సూచించారు. 45 ఏండ్లు పైబడినవారు వ్యాక్సిన్ వేసుకోవడం, అన్ని వేళలా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి సూత్రాలు తప్పనిసరి అని చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ వైరస్‌ను కట్టడిచేయడంలో తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సనత్‌నగర్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే అవకాశమే లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 2 వేల పైచిలుకు అనాథ శరణాలయాలకు విదేశీ ఆర్థిక సహాయం నిలిచిపోయిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇవీ కూడా చదవండి…
జవాన్ల మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కామారెడ్డి ట్రస్మా అధ్యక్షుడు
కొండపోచమ్మ సాగర్ అద్భుతంగా ఉంది
ప్రభుత్వ పాఠశాలలకు కాగ్నిజెంట్ 500 ట్యాబ్లెట్లు, 50 ల్యాప్‌టాప్‌ల విరాళం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

