చర్ల/వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 8 : ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందేందుకు ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్టు మావోయిస్టు పార్టీ వాజేడు-వెంకటాపురం ఏ రియా కార్యదర్శి శాంత తెలిపారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు పోలీసుల మాటలు నమ్మి, డబ్బుకు ఆశపడి ఇన్ఫార్మర్లుగా మారి షికారు పేరుతో గుట్టవైపు వస్తున్నారని మంగళవారం విడుదల చేసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. తమ రక్షణ కోసం అమర్చిన బాం బుల వల్ల ఇతరులు గాయపడుతున్నారని, పోలీసుల మాటలు నమ్మి ఎవరూ ఇటువైపు రావొద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని, ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.