హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని 28 జిల్లాలో 5,120 పోస్టాఫీసుల ద్వారా 1,14,061 పోస్టల్ ఖాతాలను తెరిచి.. ఆల్ ఇండియా స్థాయిలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ 4వ స్థానంలో నిలిచినట్టు హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి తెలిపారు. గత ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ సేవింగ్ బ్యాంక్ మహా మేళాలను నిర్వహించామని పేర్కొన్నారు. ఖమ్మంలో 21,295 ఖాతాలు, కరీంనగర్లో 14,182, పెద్దపల్లిలో 11,148, నిజిమాబాద్లో 10,937 ఖాతాలు తెరిచి ముందు వరుసలో ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు మొత్తం 37.68 లక్షల ఖాతాలను తెరిచినట్టు వెల్లడించారు.