జీవో 111 ఎత్తివేతకు కేబినెట్ నిర్ణయం : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం ఆయా ప్రాంతాల ప్రజలకు మంచి శుభవార్త అన్నారు. అయితే, జీవో 111 ఎత్తివేత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, వాటిని తొలగించి జీవో ఎత్తివేస్తామని చెప్పారు. దీనిపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని సీఎం కేసీఆర్ తెలిపారు.
దీనిపై చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, రెండు జలాశయాలు కలుషితం కాకుండా.. గ్రీన్‌జోన్ డిక్లేర్ చేస్తూ, మాస్టర్‌ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ జీవో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం అవుతుందని, ఆ తర్వాత దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. అలాగే మే 28 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి డ్రైవ్ మరోసారి ఉధృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- GO 111
- Rangareddy
- Vikarabad
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

