హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సీపీఎస్ రద్దు చేసినట్టు త్వరలోనే ఓపీఎస్‌ను తెలంగాణలోనూ అమలు చేస్తారన్న ఆశాభావాన్ని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ సీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సీపీఎస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్రం ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్గౌడ్తోపాటు 33 జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు.