Gift A Smile | గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా విరాళాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం ద్వారా చిరునవ్వులు పంచేందుకు ప్రయత్నిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంతో స్ఫూర్తిపొంది ఎంతో మంది ఇందులో భాగస్వాములవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతిభావంతులైన వారి బంగారు భవిష్యత్తు కోసం సాయం చేయడానికి ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతగా ఉండాలన్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం స్పిరిట్‌తో ప్రముఖ న్యూరోఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ పాతకోటి, ఆయన సతీమణి డాక్టర్ ప్రణయవాణి పేద వైద్య విద్యార్థినికి సాయం చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. పేదింటికి చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని సుస్మిత వైద్య విద్య కోసం లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.
అలాగే మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరి తండాకు చెందిన ప్రతిభావంతమైన నిరుపేద విద్యార్థి చంద్రశేఖర్, పైచదువుల కోసం ల్యాప్‌టాప్ అవసరం ఉన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన వ్యాపారవేత్త నాయిని వెంకటేశ్వర రెడ్డి ల్యాప్‌టాప్, లక్ష రూపాయల చెక్కును అందజేశారని చెప్పారు. తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన చంద్రశేఖర్, నాయిని వెంకటేశ్వర రెడ్డి గారి మద్దతుతో అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడని పేర్కొన్నారు.
Under the “Gift A Smile” initiative, we have been trying to spread smiles by helping through donations, service activities and community welfare efforts
Inspired by the spirit of the program, renowned neurophysician Dr. Chandra Shekar Pathakoti (MD/DM) and his wife Dr. Pranaya… pic.twitter.com/d9inE2FPOb
— KTR (@KTRBRS) July 21, 2025