Minister Ponnam Prabhakar | హైదరాబాద్: అవును మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నామని స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా తాము నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పలేదని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన నియామకాలకు ఇప్పుడు పత్రాలు అందిస్తూ.. ఆ నియామకాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుందని విమర్శించారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం… తాము నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఒప్పుకొన్నారు.