హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ పేర్కొన్నా రు. ఇటీవల బీహార్‌లో విజయవంతంగా పూ ర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన బీఎల్వోల సమావేశంలో సీఈసీ మాట్లాడుతూ భారత ఎన్నికల వ్యవస్థకు బీఎల్వోలే వెన్నెముక అని చెప్పారు. వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా సవరణ విజయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. దేశంలో ఎన్నికల నిర్వహణను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్నదని వ్యాఖ్యానించారు. బీహార్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఎలాంటి లోపాలు లేకుం డా పూర్తయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో సుమా రు 7.5 కోట్ల మంది ఓటర్లు ఓటు హకు వినియోగించుకున్నారని, విజయానికి కారణమైన బీహార్ బీఎల్వోలను అభినందించారు.
పట్టణ ఓటర్లలో నిరాసక్తత
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తకువ గా ఉండటానికి ఓటర్ల నిరాసక్తతే కారణమని సీఈసీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉత్సాహంగా ఓటుహకు వినియోగించుకుం టూ దేశానికి దారిచూపుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నికల చట్టాలను ప్రతి ఒకరూ పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. 1995లో సభ్యదేశంగా చేరిన ‘ఇంటర్నేషనల్ ఐడియా’కు దాదాపు మూడు దశాబ్దాల తర్వా త భారత్‌కు చైర్మన్ స్థానం లభించిందని తెలిపారు. ఇది భారత ఎన్నికల సంఘం ప్ర పంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, వినూత్న ఎన్నికల నిర్వహణ సంస్థగా గుర్తింపు పొందినదనడానికి నిదర్శనమని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విసృ్తతిని ప్రస్తావిస్తూ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 90 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారని వివరించారు. సమావేశానికి ముందు రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన గణాంకాలను వివరించారు. సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికలఅధికారి వాసం వెంకటేశ్వరరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సీనియర్ డిప్యూటీ సీఈసీ పవన్‌కుమార్ శర్మ, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.