లింగాలఘనపురం, జూలై 17: గోదావరి జలాలతో చెరువులను నిం పడం సాధ్యం కాద ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతులెత్తేశారు. జనగామ జిల్లా లింగాలఘనపురంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను తనకు అప్పగిస్తే మూడు నెలల్లో నింపుతానని హరీశ్‌రావు అంటున్నారు.. మేడిగడ్డ.. కన్నెపల్లి వద్ద అసలు నీటి ప్రవాహం లేనేలేదు.. ఎత్తిపోసే అవకాశమే లేదు అని పేర్కొన్నారు. భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా ఉన్న అనుభవంతో చెబుతున్నా.. నీళ్లను ఎత్తి పోయలేం అని పేర్కొన్నారు