Tummala Nageswar Rao | నల్లగొండ, నవంబర్ 22 : అధికారంలో ఉండి రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని మంత్రుల ఎదుట నల్లగొండ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌తోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మి ర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కోతల సమయంలో రైతులకు అండగా ఉండలేకపోవటం వల్ల గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయామని అన్నారు. నెల, 20 రోజుల కింద రైతులు పండించిన ధాన్యంతో రోడ్ల మీదకు వచ్చారని, మిల్లర్లు రైతుల నిస్సహాయతను అదును చేసుకొని తక్కువ ధరకే ధాన్యం తీసుకున్నారని తెలిపారు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యేలం కూడా రైతులను ఆదుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మా ట్లాడుతూ..
అమ్ముకునే సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉన్నదని అన్నారు. ఈ విషయమై దృష్టి సారించి ఇక నుంచి ఇలాంటి సమస్య లేకుం డా వ్యవసాయ శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు తప్ప కొనుగోలు కేంద్రాల్లో అధికారులు కనిపించటం లేదని, అసలు బాధ్యత కలిగిన అధికారి క్షేత్ర స్థాయి లో ఉన్నప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కేంద్రాల్లో కొన్న ధాన్యం మిల్లుల్లోకి తీసుకెళ్లిన తర్వాత కొర్రీలు పెట్టి రైతులకు కోతలు పెడుతున్నారని నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై మంత్రి తు మ్మల నాగేశ్వర్రావు స్పందిస్తూ రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. త్వరలో రేషన్‌కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో గత సంవత్పరం వానకాలంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సారి 45 లక్షల ఎకరాల్లో సాగైనట్టు చెప్పారు.