DGP | హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్‌ను గుర్తిస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఉగ్ర కుట్రసూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. స్లీపర్ సెల్స్ గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉగ్రకుట్రకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాయగా.. ఏర్పాటు దశలోనే గ్రూప్‌ని కనిపెట్టి విచ్ఛిన్నం చేసినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఆపరేషన్‌ను కేంద్ర బలగాలే నిర్వహించాయన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది మావోయిస్టులు లొంగిపోయారని, రాష్ట్రంలో మావోయిస్టులు ఇంకెవరైనా ఉంటే వెంటనే లొంగిపోవాలని కోరారు.