Minister Ganguala | దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. అంబేద్కర్ స్టేడియంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్, అలీం కో సహకారంతో నిర్వహించిన దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ.42వేల విలువైన ఒక్కో సైకిల్‌ను 30 మంది దివ్యాంగులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వికలాంగులకు రూ.4వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రానున్న రోజుల్లో దివ్యాంగులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ బీ గోపి, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.