హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
శనివారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్‌లో జ్యోతిరావుఫూలే సినిమా ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ నాయకులు హాజరవుతారని వెల్లడించారు.