కేసీఆర్ ఉన్నప్పుడు యాసంగిలోనూ నీళ్లు పారినయ్. ఈ ఏడు వానకాలం నీళ్లు రాలే.. యాసంగికీ రాలె. నాకు ఎస్సారెస్పీ కాల్వ రెండు పక్కల ఏడెకరాల భూమున్నది. ఓ పక్క మూడెకరాలు, ఇంకోపక్క రెండెకరాలు ఎండిపోయింది. మూడు బోర్లు వేస్తే లక్షా యాభై వేల ఖర్చయింది.
200 ఫీట్లు తవ్వినా నీళ్లు పడలే. మా ఎమ్మెల్యే మందుల సామేలు సుక్క నీళ్లు రావంటున్నడు. ఏదో మార్పు వస్తదనుకొని కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ఇప్పుడు చెంపలేసుకుంటున్నం.
– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎదట నూతనకల్ రైతు సాబాది మల్లారెడ్డి ఆవేదన ఇది