కన్నెపల్లి నుంచి నీళ్లెత్తిపోయాల్సిందే
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి సాగు, తాగు కోసం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
- అన్నారం బరాజ్‌లో లీకేజీలేమీ లేవు
- ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మేల్కొనాలి
- ఆలస్యం చేస్తే కరువు తాండవిస్తుంది
- సాగు, తాగునీటిపై రాజకీయాలొద్దు
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
జయశంకర్ భూపాలపల్లి, జూలై 18 (నమస్తే తెలంగాణ): కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి సాగు, తాగు కోసం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సర్కార్ వెంటనే మేల్కొని కన్నెపల్లి పంపులను నడిపించాలని సూచించారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బరాజ్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో సాగు, తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన పిల్లర్‌కు మరమ్మతు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే కన్నెపల్లి నుంచి అన్నారం బరాజ్‌కు నీటిని తరలిస్తే రాష్ట్రంలో సాగు, తాగునీటికి కరువు ఉండదని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

