ధర్మారం/ రామడుగు, ఆగస్టు 18 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లోని పంప్‌హౌస్‌లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఈ నెల 13 నుంచి 4 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా, సోమవారం రెండు మోటర్లను నిలిపివేసి, ప్రస్తుతం రెండు మోటర్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. ఒకో మోటర్ ద్వారా 3,150 క్యూసెకుల చొప్పున 6,300 క్యూసెక్కులు ఎత్తిపోసి నంది రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు.
అక్కడి నుంచి రెండు అండర్ టన్నెళ్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపు హౌస్‌కు పంపిస్తున్నారు. ఇకడి పంప్‌హౌస్‌లో రెండు మోటర్ల ద్వారా ఎత్తిపోస్తూ వరద కాలువ ద్వారా శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు 4.1 టీఎంసీల నీటిని శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించినట్టు పేర్కొన్నారు.