ఎల్లారెడ్డిపేట/ ముస్తాబాద్ ఫిబ్రవరి 16: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జల సంరక్షణ చర్యలు బాగున్నాయని కేంద్ర బృందం ప్రశంసించింది. ఈజీఎస్ కేంద్ర కమిటీ సభ్యులు ఎం సుధీర్‌కుమార్, ఏఎల్ ఫ్రాంక్లిన్ తదితరులు గురువారం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, హరిదాస్‌నగర్, ముస్తాబాద్‌లో పర్యటించారు. రాజన్నపేటలో పునరుద్ధరించిన వడ్లవాని కుంట చెరువు, ఫీడర్ చానల్, మండల పరిషత్ కార్యాలయంలో వాటర్ హార్వెస్టింగ్ తీరు,
హరిదాస్‌నగర్‌లో ఫారం పాండ్, ముస్తాబాద్‌లో పెద్ద చెరువు, నామాపూర్ శివారు గుట్టల్లో తవ్విన కాంటూరు కందకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు అధికారులు చేపట్టిన చర్యలు బాగున్నాయని అభినందించారు.