హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సర్కారు కులవృత్తులు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి వి నూత్నమైన, విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ద వాఖానలు, మెడికల్ కాలేజీలు, గురుకులా లు, క్రీడా సంస్థలు, ఆలయాలు, అతిథి గృహా లు, పోలీస్ హెడ్ క్వార్టర్స్, బెటాలియన్లలో బట్టలు ఉతికే పనులను రజకులకే అప్పగించాలని నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను అటకెక్కించింది.
ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులను కాంట్రాక్టర్లకు అప్పగించే విధానం అమల్లో ఉంది. దీంతో బడాబాబులు కోట్లు సంపాదిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ను కలిసిన రజక సంఘాల ప్రతినిధులు పరిస్థితిని వివరించారు. మానవీయతతో స్పందించిన కేసీఆర్ ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులను రజక సమాఖ్య పరిధిలోని 4417 సొసైటీలకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం 2023 జూన్ 30న జీవో 102 జారీ చేసింది. జీవోను అమలు చేయాలని తెలంగాణ రజక సహకార సంఘాల సమాఖ్య ఎండీ చంద్రశేఖర్ ఫిబ్రవరిలో ప్రతిపాదనలు పంపగా సర్కారు కాలయాపన చేస్తున్నది.
రాష్ట్ర ఏర్పాటు త ర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి కేం ద్రీకరించారు. రజకుల కోసం దోబీఘాట్లు, ఆ ధునిక లాండ్రీల నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. 250యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించారు. బట్టలు ఉతికే కాంట్రాక్టు ప నులను రజకులకే కేటాయిస్తూ గొప్ప నిర్ణ యం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో అమలును పట్టించుకోవడం లేదు.
– కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ సంఘాల కన్వీనర్